Header Banner

రైతుల భూములే వారికే కోటిదారులయ్యే మార్గం! అమరావతిలో అభివృద్ధి జోరు!

  Thu May 01, 2025 17:22        Politics

మేడే సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన 11 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించి, రాష్ట్రంలోని కార్మికులు, అభివృద్ధి ప్రణాళికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అత్యధికంగా అసంఘటిత కార్మికులే ఉన్నారని, గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో వారు అనేక కష్టనష్టాలకు గురయ్యారని అన్నారు. ఇసుక ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరే అవకాశం ఉన్నప్పటికీ, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆ ఆదాయాన్ని వదులుకుని ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనికి తోడుగా నాలా చట్టాన్ని కూడా రద్దు చేసినట్లు ఆయన వెల్లడించారు. కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి ఆరోగ్య అవసరాల కోసం కర్నూలు, గుంటూరులలో వంద పడకల సామర్థ్యంతో ప్రత్యేక ఆసుత్రులను నిర్మిస్తున్నామని వివరించారు.

రాజధాని అమరావతి నిర్మాణం ద్వారా ఆంధ్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా తమ భూములను ప్రభుత్వానికి అప్పగించారని గుర్తుచేశారు. ఆ భూములను అభివృద్ధి చేసి, కొంత భాగాన్ని తిరిగి రైతులకే ఇవ్వడం ద్వారా వారిని కోటీశ్వరులను చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో భూముల విలువ గణనీయంగా పెరిగిందని ఆయన అన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్నామని, మొత్తం 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులను నెలకొల్పుతామని చంద్రబాబు ప్రకటించారు. అయితే, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కొందరు ఓర్వలేకపోతున్నారని ఆయన పరోక్షంగా వైసీపీని విమర్శించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు.


ఇది కూడా చదవండి: క్రీడాకారులకు గుడ్‌న్యూస్‌! డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్ విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారిడీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #AmaravatiDevelopment #FarmersToMillionaires #CMChandrababu #APProgress #CapitalRising #AmaravatiBoom